మహిళలకు మెరుగైన ఆదాయం అందిస్తోన్న రొయ్యలు,సీ ఫుడ్ ప్రాసెసింగ్

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న రొయ్యల పెంపకం,సీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలతో (Shrimp and seafood processing)మహిళలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి.

ఏపీలో రొయ్యల ప్రాసెసింగ్.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం అందించడం ద్వారా వారి సాధికారతకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. గడిచిన 10 సంవత్సరాలలో..ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేదా ఫ్యాక్టరీలు 20 నుండి 90కి పైగా పెరిగాయి. ప్రతి ప్రాసెసింగ్ ఫెసిలిటీలో పెట్టుబడి సగటున 5 మిలియన్ డాలర్ల గా ఉండగా.. ప్రాసెసింగ్ రంగంలో మొత్తం పెట్టుబడి 400 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా.

 

ఈ ప్రాసెసింగ్ యూనిట్లులేదా ఫ్యాక్టరీలు తరచుగా ప్రాసెసింగ్, సార్టింగ్, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ వంటి వివిధ పాత్రలలో మహిళలను నియమించుకుంటాయి. ఇదే సమయంలో కొంతమంది మహిళలు తమ వ్యాపారాలను ప్రారంభించడానికి రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల నుండి వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. దేశంలో మొత్తం 1.2 కోట్ల మంది మహిళలు రొయ్యలు, మత్స్య పరిశ్రమలో పనిచేస్తున్నారు.

మహిళలు రొయ్యల ప్రాసెసింగ్‌లో తమ అనుభవాన్ని ఉపయోగించి ఫుడ్ ప్రాసెసింగ్ లేదా రొయ్యల పెంపకం వంటి వారి స్వంత చిన్న వ్యాపారాలను ప్రారంభించారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో రెండేళ్లుగా పనిచేస్తోన్న లక్ష్మీ అనే కార్మికురాలు మాట్లాడుతూ.. తనకు గతంలో చేసిన పని కంటే ఇప్పుడే మంచి జీతం, ఆహారం, వైద్య సహాయం కూడా అందుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది మహిళలు రొయ్యల ప్రాసెసింగ్‌లో తమ అనుభవాన్ని ఉపయోగించి ఫుడ్ ప్రాసెసింగ్ లేదా రొయ్యల పెంపకం వంటి వారి స్వంత చిన్న వ్యాపారాలను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల ప్రాసెసింగ్ మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం, వారికి కొత్త నైపుణ్యాలను నేర్పడం, మరింత స్వతంత్రంగా చేయడం ద్వారా వారికి సహాయపడింది. ఇది గ్రామీణ సంఘాలను మరింత బలోపేతం చేసింది.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు