AP Govt: హైదరాబాద్‌లో ఆఫీసులకు ఏపీ సర్కార్ అద్దె చెల్లించాలా?

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మే 13న అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నెల జూన్ 4వ తేదీన అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారం చేపడుతుంది? మరోసారి జగన్ వస్తారా? లేదంటే ఈ సారి చంద్రబాబుకు జనం అవకాశం ఇస్తారా? ఇలా ఏపీలో ఏం జరుగబోతుందో అనే అంశం ఆసక్తిగా మారింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత… తెలంగాణలో ఉన్న ఆఫీసులకు ఏపీ అద్దె చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం లేక్ వ్యూ అతిథి గృహం, లక్డీకాపూల్‌లో సీఐడీ ఆఫీసు, ఆదర్శ్ నగర్ లోని హెర్మిటేజ్ భవనం ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వీటిని ఖాళీ చేయడానికి మరో ఏడాది పాటు గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సర్కారును అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనను తెలంగాణ సర్కారు తిరస్కరించినట్టు సమాచారం. అయితే అద్దె ప్రాతిపదికన ఏడాది పాటు వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తుందని తెలుస్తోంది.

2016లో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించా రు. పలు విభాగాలను, శాఖల కార్యాలయాలను అక్కడికి తర లించారు ఏడాది పాటు ఈ తరలింపు ప్రక్రియ కొనసాగింది. 2019లో ఏపీ ప్రభుత్వం కొన్ని భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ ఈ భవనాలను ఆస్తిపన్ను నుంచి మినహాయించాలని తెలంగాణ సర్కారుకు సూచించారు. రాష్ట్రం విడిపోయి ఈ ఏడాది జూన్ 2వ తేదీతో పదేళ్లు పూర్తవుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే పరిమితమవుతుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించి తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్లో కొనసాగుతున్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు, అతిధి గృహాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని రోజులపాటు కొనసాగాలంటే తెలంగాణ ప్రభుత్వానికి నిర్దేశించిన అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకా రం, ఉమ్మడి ఏపీ విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత, అవశేష రాష్ట్రం ఏపీ తన అధీనంలో ఉన్న భవనాలను, హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌసు కూడా ఖాళీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే జూన్ 2 లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే ఖాళీ చేయడమా..? లేకుండా అద్దెలు చెల్లించడమా అనే నిర్ణయం తీసుకోవాలి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సీఐడీ ఆఫీసు, హెర్మిటేజ్ భవనాలను అవసరాల కోసం ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటుందని కోరగా అందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిచింది. ప్రస్తు తం గడువు ముగిసినందున ఈ మూడు భవనాలను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేస్తుందా? లేదంటే అద్దె చెల్లిస్తుందా ? అనేది

ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు