ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..

ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో ఇండియాలో అతిపెద్ద సంస్థగా హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీకి మంచి మార్కెట్ ఉంది. కంపెనీ గడచిన కొన్నాళ్లుగా తమ వ్యాపారాలను రీస్రక్చరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీ తాజాగా తన ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్ వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తోంది. మీడియా నివేదికల ప్రకారం దీని కోసం కంపెనీ కొంతమంది కొనుగోలుదారులతో చర్చలు కూడా జరుపుతోందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు.

 

నివేదికల ప్రకారం హిందుస్థాన్ యూనీలివర్ ప్యూరిట్ విక్రయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. అయితే దానికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించబడింది. గడచిన కొన్ని నెలలుగా దీనికి సంబంధించిన విక్రయ చర్చలు జరిగినట్లు వెల్లడైంది. ఇందులో ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. Pureit వ్యాపార విక్రయానికి సంబంధించిన చర్చలు దాని మాతృ సంస్థ Unilever Plc నీటి శుద్ధి పరికరాలను తయారు చేసే చైనాకు చెందిన Qinyuan గ్రూప్‌లో తన మెజారిటీ వాటాను విక్రయిస్తున్న సందర్భంలో వచ్చాయి.

యూనీలివర్ చైనా కంపెనీలో 2014లో వాటాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వాటాల విక్రయ డీల్ విలువ సుమారు 300 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి హిందుస్థాన్ యూనీలివర్ ఈ వ్యాపారంలోకి 2004లో ప్రవేశించింది. కంపెనీ యురేకా ఫోర్బ్స్, కెంట్ వంటి స్థాపించబడిన బ్రాండ్‌లతో పోటీ పడేందుకు హిందుస్థాన్ యూనీలివర్ ఎంట్రీ-లెవల్ గ్రావిటీ వాటర్ ప్యూరిఫైయర్‌తో ప్యూరిఫైయర్ మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కంపెనీ 2011లో రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్యూరిఫైయర్‌ను ప్రారంభించి నేడు భారతీయ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తోంది.

గత కొంత కాలంగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు వాటర్ ప్యూరిఫైయర్ వ్యాపారంపై ఆసక్తి చూపుతున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ 2021లో యురేకా ఫోర్బ్స్‌లో వాటాను దాని మాజీ యజమాని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి దాదాపు రూ.4,400 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో కొనుగోలు చేసింది. యురేకా ఫోర్బ్స్ ప్రముఖ ఆక్వాగార్డ్ బ్రాండ్ క్రింద వాటర్ ప్యూరిఫైయర్‌లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ వాక్యూమ్ క్లీనర్లతో పాటు ఇతర కన్జూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు