Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!

బంగారం ధర పెరుగుతూనే ఉంది. నెల క్రితం వరకు 10 గ్రాములకు రూ.63 వేలు ఉన్న పుత్తడి ప్రస్తుతం రూ.67 వేలకు చేరింది. తాజాగా శుక్రవారం కూడా బంగారం ధర కాస్త పెరిగింది.

24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6,732 గా ఉంది. అంటే 10 గ్రాముల స్వర్ణం ధర రూ. 67320 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 61,710 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6171 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6732గా ఉంది.

కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67320 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,710 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6,251 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6819గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,860 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,470 గా ఉంది.

 

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,300 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,700 గా ఉంది. కరీంనగర్, విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.67,500 ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా బంగారం ధర పెరుగుతుందా, లేదా అనేది చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతోన్నాయి. స్పాట్ బంగారం ఔన్సు ధర 22234 డాలర్లుగా ఉంది.

24 క్యారెట్ల బంగారం అంటే.. ముడి బంగారం. దీంతో ఎలాంటి వస్తువులు చేయలేం. 24 క్యారెట్ల బంగారంలో రాగి కలిపితే 22 క్యారెట్ల బంగారం అవుతోంది. అప్పుడు దాన్ని ఆభరణంగా తయారు చేయవచ్చు.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు