సాక్షి శ్రీ దినపత్రిక గార్ల ప్రతినిధి (వి. వెంకటేశ్వర్లు 9705884745)
గార్ల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శ్రీ ధర్మశాస్త్ర పీఠం సభ్యుల ఆధ్వర్యంలో పట్టణంలో అయ్యప్ప స్వామి శరణాలతో శరణు ఘోషలతో పట్టణమంతా స్వాములు నగర సంకీర్తన చేశారు అనంతరం శ్రీ లక్ష్మి నారాయణ ఆలయ ఆవరణలో రాంబాబు (గురుస్వామి) తో మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర పీఠం సభ్యులు మాట్లాడుతూ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పాడిపంటలు మంచిగా పండాలని అంటు వ్యాధులు ప్రబలకుండా చిన్న పెద్ద ఊరు వాడ ప్రజలందరూ ఒక సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామి కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గార్ల సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్ దంపతులు, శ్రీ ధర్మ శాస్త్ర పీఠం గురుస్వాములు తోడేటి విజయరాముడు, తానం కొండల్ రెడ్డి వల్లపుదాసు వెంకటేశ్వర్లు అక్కి ఉపేందర్ వీరబత్తిని రాము తాళ్లూరి రవీందర్, పీఠం సీనియర్ స్వాములు వెంపటి దుర్గారావు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు…



![]()









