యూనిక్ ఐడీలు కేటాయింపు పూర్తి: డీఐఈఓ

విద్యార్థులకు అందుబాటులో ఆన్ లైన్ చెక్ లిస్టులు

వరంగల్ సాక్షి శ్రీ, గత వారంరోజులుగా నిర్వహించబడుతున్న వరంగల్ జిల్లాలోని అన్ని కళాశాలల సిబ్బంది సర్టిఫికేట్లు, ఆధార్ అకౌంట్ నంబర్ల ఫిజికల్ వెరిఫికేషన్ గురువారం నాటికి పూర్తయింది. అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది ఇంటర్ కార్యాలయంలో స్వయంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నాం. సరైన వివరాలు లేని వారివి కళాశాలకు రివర్ట్ చేసి, సరి చేసిన తర్వాత మాత్రమే దృవీకరిస్తున్నాం. ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన నూతన సంస్కరణల్లో భాగంగా సిబ్బందికి శాశ్వత యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు. యూనిక్ ఐడీ ద్వారా సిబ్బంది విద్యార్హతలు, అపాయింట్ మెంట్ తేదీలు, ఆధార్, బ్యాంకు ఖాతా తదితర అన్ని వివరాలు సత్వరమే పొందవచ్చు. ఇంటర్ పరీక్షలు, మూల్యాంకనం తదితర అన్ని బోర్డు చెల్లింపుల్లో యూనిక్ ఐడీ ఉపయోగపడబోతోంది.
అక్టోబర్ 15 వతేదీ నుండి ఇంటర్ విద్యార్థులు స్వయంగా చెక్ లిస్టులు సరి చూసుకోనే వెసులుబాటు కల్పించారు. మేము అన్ని కళాశాలలకు ఆన్ లైన్ లింకు పంపించాం. ఈ సేవ ద్వారా విద్యార్థులు తమ పేరు, తండ్రిపేరు, ఫోటో, సంతకం, తమ గ్రూపు, ద్వితీయ భాష, పుట్టుమచ్చలు తదితర అన్ని వివరాలను సరి చూసుకోవచ్చు. విద్యార్థుల చెక్ లిస్టును కళాశాలల సిబ్బంది కన్ఫర్మ్ చేస్తారు. భవిష్యత్తులో పరీక్షల సందర్భంగా ఎటువంటి తప్పులు దొర్లకుండా ఇంటర్ బోర్డు ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. కావున విద్యార్థులు వారి తల్లి దండ్రులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు