•••భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
•••••జలమయం అయిన రోడ్లు, వంతెనలు,వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు
•••••అత్యవసర సమయాల్లో డయల్ 100
•••• కారేపల్లి ఎస్ఐ బైరు గోపి
కారేపల్లి ఆగస్టు 28
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కారేపల్లి ఎస్సై బైరు గోపి సూచించారు.జిల్లాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగాప్రవహిస్తుండటంతో
నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని ఆన్నారు. ఎవరు కూడా చేపాల వేటాకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితులు వుండే అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు.
అత్యవసర సమయాల్లో డయల్ 100కు, కారేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సెల్ నెంబర్8712659141 కు కాల్ చేయగలరు.ఇప్పటికే చెరువులు, వాగుల వద్ద పోలీస్ పెట్రోలింగ్ పెంచి ప్రమాద హెచ్చరికలను తెలియజేస్తున్నాం అన్నారు.