తెలంగాణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది పాండురంగ విఠల్ గారికి ఇల్లందువాసి పర్యావరణవేత్త తెలంగాణ రాష్ట్ర ఉత్తమ పారా లీగల్ వాలంటీర్ గాయత్రి పరివార్ సతీష్ ఖండేల్వాల్ ఔషధ మొక్క బహుకరించి అభినందనములు తెలిపారు.ఈ సందర్భంలో సతీష్ ఖండేల్వాల్ మాట్లాడుతూ బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం అందక నష్టపోతున్నారని వారిని ఆదుకోనుటకు ప్రతి గ్రామ గ్రామానికి న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవల కేంద్రాలను ఏర్పాటు చేసి న్యాయం అందించాలని సతీష్ ఖండేల్వాల్ వారిని కోరారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం న్యాయవాది పరిషత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కిరణ్ ముధల్కర్ గాయత్రి పరివార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


