ఇంటర్ విద్యార్థుల ఆధార్ నవీకరించాలి: డీఐఈఓ*కళాశాలల్లోనే ఆధార్ నవీకరణ

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ వివరాలు నవీకరించుకోవాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు ఆదేశానుసారం విద్యార్థుల వేలిముద్రలు, జన్మతేదీ తదితర అన్ని వివరాలను కళాశాలల్లోనే నవీకరించుకోవాలని అన్నారు. ఆధార్ నవీకరణకు గాను వరంగల్ జిల్లాలోని కళాశాలల యాజమాన్యాలు “విరించి” ఏజెన్సీ ఇంఛార్జ్ సాంబశివ చారీ (సెల్ నం. 7013091290) ని సంప్రదించాలని అన్నారు.
ఇంటర్ విద్యార్థులు ఆధార్, అపార్ తదితర వివరాలను నవీకరించాలని, యు-డిఐఎస్ ఈ పోర్టల్ లో విద్యార్థుల పాన్/ ఆధార్ తదితర వివరాలను పూర్తి చేయడం తప్పని సరి అని తెలిపారు.వరంగల్ జిల్లాలో 67 కళాశాలల్లో అడ్మీషన్ పొందిన విద్యార్థుల అన్ని వివరాలను నవీకరించడానికి సంబంధిత కళాశాలల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు