ప్రభుత్వ కళాశాలల్లో ఐఐటీ, నీట్ తరగతులు:డీఐఈఓటైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించాలని సూచన

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటీ, నీట్ తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ నివ్వాలని, సంబంధిత టైం టేబుల్ ను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. స్థానిక డీఐఈఓ కార్యాలయంలో ప్రిన్సిపాళ్లకు “అకాడమిక్ డెవలప్ మెంట్ మీటింగ్” నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియేట్ సైన్స్ విద్యార్థుల కొరకు “ఫిజిక్స్ వాలా” వారి సౌజన్యంతో “ఆన్ లైన్ ఉచిత కాంటెంట్” తరగతులు ఉన్నాయని, సైన్స్ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు ప్రతీ రోజు నిర్ధారిత సమయాల్లో విద్యార్థులకు తగు సదుపాయం కల్పించాలని అన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం, అసైన్ మెంట్లు, వాటి మూల్యాంకనం తదితర అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌళిక సదుపాయాల కొరకు ఇంటర్ కమీషనర్ గారు తగు నిధులు మంజూరు చేసారని, నిధులను సద్వినియోగం చేసుకొంటూ అన్ని కళాశాలల్లో “అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ” లను ఏర్పర్చుకొని సంబంధిత ఛైర్మెన్ల ఆధ్వర్యంలో కళాశాలల రిపేర్లు తదితర పనులను పర్యవేక్షించాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారుల సూచనల మేరకు ఎప్పటికప్పుడు పనులను పూర్చి చేసిన ధృవీకరణను పై అధికారులకు పంపించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు