- 9,10 తేదీల్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్, 11,12 తేదీల్లో పర్యావరణ పరీక్షలు
వరంగల్ సాక్షి శ్రీ, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సప్లమెంటరీ ప్రయోగ పరీక్షలు ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. శుక్రవారం నాడు వరంగల్ జిల్లాలోని రంగశాయిపేట జూనియర్ కళాశాలలో నిర్వహించబడుతున్న ప్రథమ, ద్వితీయ సం. ప్రయోగ పరీక్షల తీరుతెన్నులను పర్యవేక్షించారు. ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం పరీక్షల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఛీఫ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. బోర్డు ఆదేశాల మేరకు గత నాలుగు రోజులుగా నిర్వహించబడుతున్న ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు. ప్రయోగ పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. చివరి రోజు ఉదయం మొత్తం 12 విద్యార్థులకు గాను 7 విద్యార్థులు హాజరైనారు 5 విద్యార్థులు గైర్హాజరైనారు. మధ్యాహ్నం మొత్తం 9 విద్యార్థులకు గాను 3 విద్యార్థులు హాజరైనారు 6 విద్యార్థులు గైర్హాజరైనారు.ఈ నెల 9,10 తేదీల్లో ఇంగ్లీష్ ప్రథమ, ద్వితీయ సం ప్రాక్టికల్స్ మరియు 11,12 తేదీల్లో పర్యావరణ, నైతిక విద్య పరీక్షలుంటాయని అన్నారు. వార్షిక పరీక్షల్లో గైర్హాజరైన విద్యార్థులు ఆయా తేదీల్లో పరీక్షలకు హాజరు కావాలని, అన్ని కళాశాలల యాజమాన్యాలు తగు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు.