భారత్ స్కౌట్స్ & గైడ్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నందు, పెహల్గంలో జరిగిన మారణాహోమానికి వ్యతిరేకంగా కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించటం జరిగింది. ర్యాలీలో భారత్ స్కౌట్స్ & గైడ్స్ జిల్లా సెక్రటరీ యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ అమాయక మైన పర్యాటకులపై ఉగ్రవాదులదాడులు హెయమైన చర్య అని ప్రపంచ వ్యాప్తంగా వున్న టెర్రరిజాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలని పేర్కొన్నారు.ఈ ర్యాలీలో స్కౌట్ మాస్టర్ అజిత్, గైడ్స్ కెప్టెన్ జ్యోతి 40 మంది మార్గదర్శిని హై స్కూల్ స్కౌట్స్ &గైడ్స్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.