కారేపల్లి సాక్షి శ్రీ :పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన సింగరేణి మండలం లో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపినవివరాలుఇలా ఉన్నాయి.మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన మాజీ 2 వార్డు నెంబర్ పొడుగు బుచ్చి రాములు(45) మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో తన పొలంలో పనులు చేసుకుంటున్న క్రమంలో పాముకాటు వేసింది. వెంటనే రైతు బుచ్చి రాములు కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ రైతు కొద్దిసేపటి క్రితం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.