కారేపల్లి సాక్షి శ్రీ :
ఓ మహిళపై కొందరు వ్యక్తులు విచక్షణ గ్రహితంగా దాడి జరిగిన ఘటన సింగరేణి మండలం లో చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో బొడ్రాయి సెంటర్ సమీపంలో దుకాణం నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మహిళపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేయడంతో సృహ కూలిపోయి కింద పడిపోవడంతో మృతి చెందినట్లుగా భావించి మహిళను వదిలిపెట్టి వెళ్లడంతో అక్కడ ఉన్న కొందరు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.