బయ్యారం(సాక్షి శ్రీ)
బయ్యారం మండల అభివృద్ధికి నిధులు మంజూరి చేయాలని బయ్యారం సొసైటి చైర్మన్ మూల మధుకర్రెడ్డి కోరారు. శనివారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రి
| పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కను హైద్రాబాద్ లో కలసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఆయాశాఖల రాష్ట్ర ఉన్నతాధికారులను కలసి అభివృద్ధి పనుల ప్రపోజల్స్. ఎస్టిమెట్స్ ఇవ్వడం జరిగిందన్నారు. మండలంలోని కోయగూడెం నుండి కాచినపల్లి వెళ్లే రోడ్డులో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, సుదరేవు నుండి మామిడిగూడెం మధ్య బిటి రహదారి, హై లెవల్ బ్రిడ్జి, అల్లిగూడెం నుండి బోటితండా రోడ్డుపైన మూడు హైలెవల్ బ్రిడ్జిలు, గౌరారం నుండి ముత్యాలమ్మగూడెం వరకు డబుల్ రోడ్డు, హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ఎస్టిమెట్స్ ఇచ్చినట్లు తెలిపారు. వారి వెంట వడ్లమూడి దుర్గాప్రసాద్, తిరుమల ప్రభాకర్రెడ్డి తదితరులు ఉన్నారు.