ఇల్లందు సాక్షి శ్రీ సర్వ సాధారణంగా పిడుగు పడితే చాలామంది ప్రాణాలు కోల్పోతారు కోల్పోతారు విధ్వంసాలు జరుగుతాయి అలాంటిది ఇల్లందులో మాత్రం పిడుగులు ఓ బాలుడి ప్రాణాలు కాపాడింది వివరాలు ఇలా ఉన్నాయి ఇల్లందు పట్టణంలోని ఎల్ బి ఎస్ నగర్ కు చెందిన ఆవుల రమేష్ పెద్ద కుమారుడు కిట్టు అదే కాలనీలో ఒక బిల్డింగ్ పై విద్యుత్ తీగలపై చిక్కిన పతంగిని తీసుకునేందుకు బిల్డింగు ఎక్కాడు పతంగి దారం ను పట్టుకొని లాగుతున్న క్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్కు గురయ్యాడు విద్యుత్ తీగలను పట్టుకొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా దేవుడు కరుణించినట్లుగా ఇల్లందు ప్రాంతంలో ఉరుములు పిడుగులు పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ బాలుడిని బిల్డింగ్ పై పడిపోయాడు బాలుడి వెంట ఉన్న స్నేహితులు స్థానికులకు సమాచారం ఇచ్చారు స్థానికులు హుటాహుటిన వెళ్లి ఆ బాలుడిని వైద్యశాలకు తరలించారు ప్రస్తుతం వరంగల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు బాలుడు క్షేమంగానే ఉన్నట్లు తల్లితండ్రులు తెలిపారు