ఆపిల్‌ కొత్త ఐప్యాడ్‌ల విడుదల మరింత ఆలస్యం.. కారణాలు ఇవేనా..??

ఆపిల్‌ నుంచి త్వరలో ఐప్యాడ్‌లు లాంచ్‌ కానున్నాయని అంతా భావించారు. అయితే ప్రస్తుతం సంస్థ ప్రణాళికల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ డివైజ్‌ల సాఫ్ట్‌వేర్‌ ఎంపికలు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలో లాంచ్‌ కానున్న ఐప్యాడ్‌ ప్రో.. కొత్త M3 చిప్‌సెట్‌ మరియు రిడిజైన్‌ చేయబడిన మేజిక్‌ కీబోర్డు, ఆపిల్‌ పెన్సిల్‌తో రానుంది. ఈ ఆపిల్‌ కొత్త డివైజ్‌లు మే నెలలో విడుదల కానున్నాయని తెలుస్తోంది.

కొన్ని నివేదికల ఆధారంగా ఐప్యాడ్‌ ఎయిర్‌ 2024.. M2 చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్‌ 12.9 అంగుళాల డిస్‌ప్లేతోపాటు 10.9 అంగుళాల వేరియంట్‌లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఉత్పత్తిలో తలెత్తిన ఇబ్బందులు కారణంగా విడుదల ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే మే నెలలో ఈ ఉత్పత్తులు విడుదల కానున్నట్లు సమాచారం.

 

అనేక నెలల తర్వాత ఆపిల్ సంస్థ తన ఐప్యాడ్‌ మోడళ్లను (iPad Pro and iPad Air 2024) అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ల్యాండ్‌స్కేప్‌ లో సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. త్వరలో విడుదల కానున్న ఐప్యాడ్‌ మోడళ్లు ఈ ల్యాండ్‌స్కేప్‌ డిజైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. అయితే ఆపిల్‌ సంస్థ ఈ వివరాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

*జూన్ 10 నుంచి నాలుగు రోజులపాటు ఆపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ (WWDC 2024) జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఆపిల్‌ సంస్థకు చెందిన అనేక ఆవిష్కరణలు సహా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. జనరేటివ్‌ AI పైన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. దీనిపై ఆపిల్ ఎప్పటి నుంచో పనిచేస్తోంది. మరియు ఈ విభాగంలో ఇటీవల కాలంలో నియామకాలను కూడా చేపట్టింది. డార్విన్‌ AI స్టార్టప్‌తో జతకట్టింది.

ఈ వరల్‌వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో iOS 18, iPadOS 18, WatchOS అప్‌ డేట్‌ సహా macOS లను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీనిపై ఆపిల్‌ విడుదల చేసిన నోట్‌లో వీటిని ప్రస్తావించింది. దీంతోపాటు డెవలపర్లకు సాయం చేయడం సహా ఆపిల్‌ నిపుణులతో నేరుగా చర్చించే అవకాశం కలిగే అవకాశం ఉంది.

ఆపిల్‌ సంస్థ త్వరలో ఐఫోన్‌ 16 ను లాంచ్‌ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ కోసం GenAI ఫీచర్లను సొంతంగా అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు iOS 18 లో కీలక మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. హోంస్క్రీన్‌ను కస్టమైజ్‌ చేసుకోవడం సహా Siri లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నే

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు