కేరళ సీఎం కుమార్తె వీణా విజయన్‌తోపాటు ఆమె ఐటీ కంపెనీపై ఈడీ మనీలాండరింగ్‌ కేసు

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేరళలో భారీ చర్యలు చేపట్టింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణతో పాటు ఆమెకు చెందిన ఐటీ కంపెనీతో పాటు ఇతరులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

వీణాపై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వీణా విజయన్‌ ఐటీ కంపెనీకి ఓ ప్రైవేట్‌ సంస్థ నుంచి అక్రమ చెల్లింపులు చేసిందన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు చేపట్టింది.

కేరళ సీఎం పినరయి విజయన్‌ పెద్ద చిక్కుల్లో పడ్డారు. విజయన్ కుమార్తె వీణా విజయన్‌తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఈడీ మనీలాండరింగ్‌ కేసును నమోదు చేసింది. వీణా విజయన్ కంపెనీకి ఓ సంస్థ అక్రమ చెల్లింపులు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కొచ్చికి చెందిన CMRL అనే ప్రైవేట్ కంపెనీకి, వాణి విజయన్‌ సంస్థ ఎక్సాలాజిక్‌ సొల్యూషన్‌ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది. ఒప్పందం మేరకు ఎటువంటి సేవలు అందించనప్పటికీ 2017- 2018 మధ్య కాలంలో సీఎంఆర్‌ఎల్‌.. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కి రూ.1.72 కోట్ల చెల్లింపులు జరిపిందని ఆరోపణలు వచ్చాయి. ఓ ఖనిజ సంస్థతో అక్రమ లావాదేవీలు జరిపినట్లు సీఎం విజయన్ కుమార్తె వీణపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఎస్‌ఎఫ్‌ఐఓ ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం విషయం ఆదాయపు పన్ను శాఖ విచారణలో వెలుగు చూసింది.

ఐటీ శాఖ గతంలో CMRL అ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.ఆ సోదాల్లో ఇరు కంపెనీలకు చెందిన లావాదావీలకు సంబంధించిన పలు ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఎస్‌ఎఫ్‌ఐఓ వాణి విజయన్‌ కంపెనీ ఎక్సాలాజిక్‌ సొల్యూషన్‌పై విచారణ చేపట్టింది. దీనిపై ఎక్సాలాజిక్‌ సొల్యూషన్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సైతం ఎక్సాలాజిక్‌ పిటిషన్‌ను కొట్టి వేసింది. తాజాగా ఎస్‌ఎఫ్‌ఐఓ ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసింది.

ఆరోపణలు అవాస్తవంః సీఎం విజయన్‌

అయితే ఈ ఆరోపణలు అవాస్తవమంటున్నారు సీఎం విజయన్‌. తన భార్య రిటైర్మెంట్‌ తరువాత వచ్చిన డబ్బులతో తన కుమార్తె కంపెనీని ప్రారంభించిందని, తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. విపక్ష నేతలను ఎన్నికల వేళ కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని సీపీఎం ఆరోపించింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు