జిల్లా జడ్జిని కలిసిన ఇల్లందు బార్ అసోసియేషన్
.
ఇల్లందు , సాక్షి శ్రీ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్జ్ వసంత్ పాటిల్ ని ఇల్లందు బార్ అసోసియేషన్ లో నూతనంగా ఎన్నికైన బార్ అధ్యక్షులు భూక్య రవికుమార్ నాయక్ , ప్రధాన కార్యదర్శి కంపెల్లి ఉమామహేశ్వరరావు , సంయుక్త కార్యదర్శి కీర్తి కార్తిక్, కోశాధికారి చినుముల నవీన్ కుమార్, మర్యాదపూర్వకంగా కలిశారు, అనంతరం జిల్లా జర్జిని శాలువాతో సత్కరించినారు అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినారు. ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నందు ఖాళీగా ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే భర్తీ చేస్తామని ఈ సందర్భంగా తెలిపినారు.