ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు! ఏంటి వీటి ప్రత్యేకత? రూట్స్ వివరాలివే!

సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒకచోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు కొన్నిసార్లు బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు టూర్ మొత్తాన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుంది?

బాగుంటుంది కదా. ఇలాంటి ఐడియాతోనే సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ అయ్యాయి. అంటే ఇవి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్స్ వెళ్లేవాళ్లకు అనుకూలంగా ఉంటాయి. ఎపీలోని ముఖ్యమైన, చరిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది ఆర్‌టీసీ. ఇందులో రకరకాల రూట్స్ అందుబాటులో ఉంటాయి.

రూట్స్ వివరాలు:

విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల సూర్యలంక బీచ్‌లను కవర్ చేస్తూ ప్రతిరోజూ విజయవాడ నుంచి సర్క్యూ్ట్ బస్సు బయలుదేరుతుంది. అలాగే విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ మీదుగా మరో టూర్ కూడా అందుబాటులో ఉంది.

 

శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం హైదరాబాద్, కర్నూలు నుంచి కొన్ని సర్క్యూట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కర్నూలు నుంచి అహోబిలం, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ తిరిగి కర్నూలు చేరుకునే బస్సు అలాగే.. కర్నూలు నుంచి యాగంటి, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ కర్నూలు చేరుకునే బస్సు, ఇంకా.. కర్నూలు నుంచి మంత్రాలయం అప్ అండ్ డౌన్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ బస్సులు ఎక్కువగా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల దర్శనానికి అనుకూలంగా ఉన్నాయి. ఈ బస్సుల్లో వెళ్లేవారికి ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి. సరైన ప్లాన్ చేసుకొని వెళ్తే.. టూర్ వేగంగా పూర్తవ్వడమే కాకుండా.. ప్రయాణం మొత్తం సౌకర్యవంతంగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు