సాక్షి శ్రీ దినపత్రిక గార్ల ప్రతినిధి (వి. వెంకటేశ్వర్లు 9705884745)
సెంట్రల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) జాతీయ కార్యదర్శిగా గార్ల మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కు చెందిన పాలడుగు భాస్కర్ రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.గత నాలుగు రోజులు పాటు విశాఖ పట్టణం లో జరిగిన 18వ అఖిల భారత మహాసభ లలో ప్రస్తుతం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా పని చేస్తున్న భాస్కర్ ను జాతీయ కార్యదర్శి గా ఎన్నుకున్నారు. సంఘటిత,అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసం,కార్మికుల వేతనాల పెంపు కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోరాటాలలో కార్మికుల ను భాగస్వాములను చేసి ఉద్యమాలలో పాల్గోoటామని ఆయన తెలిపారు.తనపై నమ్మకం ఉంచి జాతీయ కార్యదర్శి గా ఎన్నిక చేసిన జాతీయ నాయకత్వo కు భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు….

![]()









