సాక్షి శ్రీ గార్ల ఈరోజు ఉదయం 8 గంటల నుండి 9:00 గంటల వరకు పోచారం సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు పనులు చేపట్టడం వల్ల సబ్ స్టేషన్ పరిధిలో గల పాలు గ్రామాలకు విద్యుత్ సరఫరా కు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ మహేంద్ర బాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ లో సబ్ స్టేషన్ పరిధిలో గల, పోచారం, గంగారాం తండా, కోట్యా తండా, ముత్తి తండా, కట్టు కుంటా తండా, చిన్నా బంజారా, గోపాలా పురం, పిని రెడ్డిగూడెంగూడెం, డాక్యా తండా, వేదనాయక పురం, అంగోత్ తండా లకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సత్యనారాయణపురం విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు నిర్వహించడం వల్ల ముల్కనూర్, మద్దివంచ, సత్యనారాయణపురం, పెద్ద కిష్టపురం, చిన్న కిష్టపురం సీతంపేట అంకన్నగూడెం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుందని , విద్యుత్ వినియోగదారులు రైతు సోదరులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు