నవంబర్ 25 తేదీ లోగా చెల్లించాలి
వరంగల్ సాక్షి శ్రీ న్యూస్, ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సం. చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన తేదీలను, ఫీజుల మొత్తం వివరాలను ఇంటర్ బోర్డు జారీ చేసిందని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 25 వ తేదీలోగా ఫీజులు చెల్లించవచ్చు. రు. 100/- అపరాధ రుసుం తో డిసెంబర్ 4 వ తేదీ వరకు , మరియు రు. 500/- అపరాధ రుసుం తో డిసెంబర్ 11 వ తేదీ వరకు చెల్లించవచ్చని అన్నారు. ప్రథమ, ద్వితీయ సం. ఆర్ట్స్ విద్యార్థులు రూ.520/- ఫీజు, సైన్స్ మరియు ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్స్ కు గాను 230/- అదనంగా చెల్లించాలని సూచించారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు బోర్డు ఆదేశాలను తప్పక అమలు పర్చాలని కోరారు.