రాజకీయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎదురుకోలేకనే ఈడి దాడులు చేయిస్తున్నారని గార్ల మండలం మాజీ జెడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈరోజు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ,గృహ నిర్మాణాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కక్షపూరితంగా ఈడి దాడులు చేయడం దుర్మార్గమన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కక్షపూరితంగా చేయడం తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక జీర్ణించుకోలేక చేస్తున్న కుట్రలను భాగంగా ఈడీ దాడులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పాలన నందు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా అవినీతికి పాల్పడ్డ వ్యక్తులపై ఈడి దాడులు చేయకుండా బిజెపి బీఆర్ఎస్ ఒకటై ఈడి దాడులు చేస్తున్నారన్నారు.ప్రభుత్వంలో ఆయన బలంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారన్న కారణంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడి దాడి చేసిందని ఈ దాడికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.