బయ్యారం సాక్షి శ్రీ న్యూస్, మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ పై కొంత మంది దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. పెట్రోల్ బంక్ లీజు యజమాని వీరన్న తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం బాలాజీపేట కు చెందిన వ్యక్తి కారులో అప్పుగా రెండు వేల డిజిల్ పోయమని సిబ్బందిపై దాడి చేయడానికి రావడంతో సిబ్బంది ప్రతిఘటించడంతో అక్కడ నుండి ఆ వ్యక్తి వెళ్లి ,మళ్లీ అదే రాత్రి 10 గంటల సమయంలో టు వీలర్ వాహనం పై బంక్ లో చొరబడి డిజీల్ డిజిటల్ మీటర్ ద్వంసం చేసి ,సిబ్బంది సన్ని ,చందులపై దాడి చేసి.కార్యాలయం తలుపులు ద్వంసం చేసినట్లు తెలిపారు. దాడి వల్ల సుమారుగా 4 నుండి 5 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. మండల కేంద్రంలో వరుస దాడుల వెనుక అరాచక శక్తుల నేపథ్యంలో మండల ప్రజలు భయ బ్రాంతులు వ్యక్తం చేస్థున్నట్లు సమాచారం.
దీనిపై ఎస్ ఐ తిరుపతి వివరణ కోరగా బంక్ పై దాడి చేసిన విషయం వాస్థవమే అని బాదితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.