వరంగల్ సాక్షిశ్రీ న్యూస్, ఆలస్య రుసుము 500తో పెంపు ఈ నెల 30 వరకు ఇంటర్ అడ్మీషన్ల గడువు పెంచినట్లు వరంగల్ జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు నిర్దేశించిన గడువు ప్రకారం అడ్మీషన్లు ఈ నెల 15 వ తేదీతో ముగిసినవి, కానీ పలు కళాశాలల విద్యార్థుల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల మరియు తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు గడువు తేదీ ఈ నెల 30వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుము తో పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఈ ఆలస్య రుసుము మినహాయింపు ఉంది. ప్రభుత్వ రంగ మరియు ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆదేశాలను పాటిస్తూ విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు.