టేకులపల్లి యువతి ఆత్మహత్య:
టేకులపల్లి సాక్షి శ్రీ :
బోడు గ్రామపంచాయతీ కి చెందిన ,యువతి పురుగుమందు తాగే ఆత్మహత్య చేసుకుంది.బోడు ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం కల్తి చంద్రశేఖర్, నర్మదా దంపతుల పెద్ద కూతురు కల్తీ శ్రీవల్లి ఇంటర్ మొదటి సంవత్సరం. తల్లి మండలించడం తో మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. ఇది గమనించిన చెల్లెలు తల్లితండ్రులు తెలపడంతో కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు వైద్యులు తెలిపారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.