ఉదయం 11 గంటల తర్వాత బయటికి రాకూడదు,:
- ** డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్
గార్ల సాక్షి శ్రీ న్యూస్, పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి ప్రజలు ఉదయం 11 గంటల లోపే తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లాలని గార్ల వైద్యశాల వైద్యాధికారి రాజ్ కుమార్ యాదవ్ ప్రజలకు సూచించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం పలు శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాజ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు ఏదైనా అత్యవసర వైద్య సహాయం కోసం 108,100 కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు తహసిల్దార్ రవీందర్ ఎస్సై జినత్ కుమార్ డిఎంఆర్ ఓ సుధాకర్ నాయక్ డాక్టర్ అనిలా వైద్య సిబ్బంది పాల్గొన్నారు.