నకిలీ పట్టాలతో పలువురికి భూ విక్రయాలు
అధికార పార్టీ నాయకుడి నిర్వాకం..?
ఇల్లందు, సాక్షి శ్రీ: ఇల్లందు పట్టణంలోని జెకె కాలనీ సి ఆర్ క్లబ్ సమీపంలో ఒక స్థలము( ప్లాట్ )తన దేనని అమాయక ప్రజలను నమ్మించి నకిలీ పట్టాలతో తనకు సంబంధం లేని భూమిని పలువురికి అధికార పార్టీకి చెందిన ఓ నేత విక్రయించిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అసలు స్థలం బాధితులు స్థలం వద్దకు చేరుకున్నారు. అధికార పార్టీ నేత నిర్వాకం వల్ల ఇరువురు బాధితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం స్థలం వద్ద ఎలాంటి రభస చేయవద్దని నేను వచ్చాక సమస్యను పరిష్కరిస్తానని అధికార పార్టీ నేత హామీ ఇవ్వడంతో బాధితులు అక్కడి నుంచి ఇంటి బాట పట్టారు. తమకు న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ ను ఆశ్రయిస్తామని బాధితులు తెలిపారు. తాత ముత్తాతల నుంచి తమకు అధికారిక భూపట్టాలు ఉన్నాయని అలాంటిది తమ భూమిని అధికార పార్టీ నేత ఇతరులకు ఎలా విక్రయిస్తారని దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వేడుకున్నారు