వేసవిలో నీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు
*** పట్టణంలోని బోర్లు మరమ్మత్తులు
** మున్సిపల్ చైర్మన్. దమ్మలపాటి వెంకటేశ్వరరావు
ఇల్లందు, సాక్షి శ్రీ: వేసవికాలంలో ఇల్లందు పట్టణ ప్రజలకు నీటి సమస్య రాకుండా ఉండేందుకు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య సూచనలతో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని బోర్లన్నీ మున్సిపల్ సిబ్బందితో మరమ్మతులు చేయిస్తున్నట్లు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు తెలిపారు. పట్టణంలో మొత్తం 79 బోర్లు ఉండగా అందులో 44 రన్నింగ్ లో ఉన్నవి . 35 రిపేర్ లో ఉండగా నేటి వరకు 16 బోర్లు రిపేరు చేయబడ్డాయని తెలిపారు. వారం రోజుల్లో మిగతా బోర్లు కూడా రిపేరు చేస్తారని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులకు ఎక్కడ ఏ లీకేజీ జరిగిన వెంటనే రిపేరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఈ నవీన్ కుమార్ ఫయాజ్ బాబా తదితరులు పాల్గొన్నారు